jokes

  • “ఏరా!? నిన్న స్కూల్ కి రాలేదు, మొన్న హోం వర్కు చేయలేదు? ఏమిటి సంగతి?”. ‘మా అక్క మీకు నమస్తే చెప్పమంది సార్!”. “ఊ! కూచో, రేగ్గ్యులర్ గా రావాలిమరి”. “నీకు అక్క ఎక్కడిదిరా!?”. “అక్కా లేదు, చెక్కా లేదు. మేస్టారి వీక్ నెస్ మీద షూట్ చేసాను. వర్క్ అవుట్ ఐయ్యింది. దట్స్ ఆల్”
  • బాత్రూములో వొళ్ళు రుద్దుకుంటున్నాడు… మనవాడు సరిగ్గా అదే టైంకి… తన మోకాలు రుద్దుకుంటున్నాడు. బయటినుంచి ఎవరో పెద్దమనిషి- “తరువాత రానా, ఏం చేస్తున్నావ్?”. “జస్ట్ బ్రెయిన్ వాష్ అంతే…”
  • “తన కోపమె మన శత్రువు: టీచింగ్ బై తిక్క సారు,

నీకు, నాకు మనకు వీపు పగిలినలిన భంగిన్,

తమ తమ కర్మలు కాలగ, మన గురువులె మనకు చాలు,

విశ్వదాభిరామ వింటే విను లేపోతెలేదు మంచిగ సుమతీ!

  • నోటరీ కి వచ్చి, వీలునామా రాయించుకున్నాడు ఒక పెద్దమనిషి. ‘పెద్ద వాడికి 10 ఎకరాలు, చిన్నవాడికి 5 ఎకరాలు, ఏకైక కూతురికి 3 ఇళ్ళు, స్నేహితులకి నేను కట్టబోయే బంగ్లా……యింకా బంధువులకి…..’. “ ఒక్క క్షణం ఆగండి. ఎంతో కష్ట పడి,  మీ యిష్టానుసారంగా, స్పష్టంగా వీలు రాస్తున్ననుగాదా….. నాక్కూడా… ఏదైనా దయచేయండి”. “అంతకన్నానా, నాకున్న. బిజినెస్సు లన్నీ నీవే పుచ్చుకో, ఉంచుకో… గాడ్ బ్లెస్ యూ మై బోయ్….” “అయితే నాఫీజు అప్పుడే యిద్దురు గాని…”. “ఓకే, నో అబ్ జేక్షన్, నో ప్రాబ్లం… అస్సలు సంగతి నీదెగ్గిరే  మొదలవ్వాలి…”. “నాదేగ్గిర మొదలవ్వటం ఎంటీ?‼….”. “అద్దేమరి…నా కొడుకులకి, కూతురికి, స్నేహితులకి, అన్నట్టు నీకూ…. ఇచ్చేవన్నీ నేను చందాల ద్వారా సంపాయిస్తానన్న మాట…. ఈ మహత్కార్యానికి నాంది నువ్వే, నీదే మొదటి కాంట్రిబ్యుషను…

చందా ఎంతేస్తావ్ చెప్పు?!….”.

  • నాటకం మధ్యలో ఆగిపోయింది. ఆ స్టేజీ మీద విలన్ కీ, హీరో తండ్రికి ఘోరమైన ‘డిస్కల్మషం’ నడుస్తోంది. ప్రాంప్టరు ఇప్పటికే 5 సార్లు అప్పటి డైలాగ్ నందించాడు. అదిగో ఆరోసారి కూడా అందించాడు. “నేను కాదు, నువ్వే అపార్ధం చేసుకుంటే ఎవరేం చేయగలరు!?”. “వినబడిందిలేరా వెధవా… అది ఎవడి డైలాగో గట్టిగా చెప్పి చావు…దరిద్రుడా‼ ” ఇదీ హీరో తండ్రి రియాక్షను.
  • గురువు గారి వాత్సల్యం పొంగి ప్రవహించింది.శిష్యులిద్దరి భుజాలమీదా చేతులేసి,“వాదన మాని, మీ ధర్మ సందేహమేదో అడగండి నాయనలారా…”. “గురువుగారూ! మీరు పరమ మూర్ఖులని వీడు, కానేకాదు, చరమ దరిద్రులని నేనూ- మీరు రాక ముందు నుంచీ వాదించేసుకుంటున్నాము. సరైన సమాధానం మీరే దయచేయాలి”. “అదా!, నేను ఎప్పుడూ పరమ మూర్ఖత్వానికి, చరమ దారిద్ర్యానికి సరిగ్గా మధ్యలో ఉంటాను నాయనా…”.
  • ఇంద్ర సభ. “ఏమి మాతలీ, నేడు గౌరవనీయులైన అష్ట దిక్పాలకులు, సర్వ సంగ పరిత్యాగులు మరియు అస్మదీయ గురువులు అయిన సప్త మహర్షులూ ఏకారణమున సభకు విచ్చేయలేదో తమరెరుంగుదురా!?”. “ దేవేంద్రా!, కారణము నేనెరుంగను గానీ, రంభా,ఊర్వశీ… ఇత్యాది అప్సరసలు నేటి నించీ విధులకు రామని, సమ్మె నోటీసులు పంపించారని చెప్పుటకు… నేను మునుపెన్నడూ యెరుంగని గర్వముతో కూడిన సిగ్గు వంటిది పడుతున్నాను”.
  • “ఇంతకీ ఏం చేస్తున్నావ్ నువ్వూ?”. “మాగ్జిమం ఈ ఏరియాలో ఉన్న డాక్టర్స్ అందరికీ మనమే మందులిస్తూ, కాంపౌండర్సు నందర్నీ మందలిస్తూ ఉంటాను”. “అదేం జాబ్ రోయ్!?”. “మెడికల్ రిప్రజెంట్…టివ్”. “ఓహో!”. “ఇంకో ఇంతకీ… నువ్వేం చేస్తున్నావో…చెప్పూ…”. “ఓ చిన్న గ్రిల్సు రూములో కుచోడం, అడిగిన వాళ్లకి లేదనకుండా సిరి సంపదలు పంచిపెట్టటం…”. “ఇంకో అదేం జాబ్ రోయ్!?”. “అద్దేమరి, స్కామ్స్ ఇండియా లిమిటెడ్ బాంక్, కుంభకోణం సిటీ బ్రాంచ్ లో కాషియర్ మనమే….”.
  • “౩౦ ఏళ్ళు పని చేశారు కదా, మీ సందేశం ఏమిటి మాస్టారూ?”. “సందేశం అంటూ ఏమీలేదు గానీ, నాకర్ధం ఐనది నే చెప్తాను”. “చెప్పండి”. “అబ్బే, ఏంలేదు, మొదటి అంటే ఫస్టు పదేళ్లల్లో నేనేం చెబుతున్నానో, నాకు తెలుసు; వాళ్ళేం వింటున్నారో వాళ్లకు తెలుసు. సెకండు పదేళ్లల్లో నేనేం చెబుతున్నానో నాకు తెలుసు; వాళ్ళేం వింటున్నారో వాళ్లకి తెలియదు. ఇంక గత పదేళ్లల్లో నేనేమి చెబుతున్నానో నాకు తెలియదు; వాళ్ళేం వింటున్నారో వాళ్లకి తెలియదు.ఇదీ సంగతి”.
  • “ఏమిటీ, దూరం నుంచి అంతా చుసేసావా…”. “ఆ, అంత పెద్ద మనిషి రోజూ నీ కాళ్ళు పట్టు కుంటూ వుంటాడు, పాపం ఏం పాపం చేసాడంటావ్?!”. “అబ్బే ఏం లేదు, ఎటే టైం తను మొహమాటపడి, నన్ను మొహమాట పెట్టి, ఏదో కొద్దిగా ఆమధ్య నేను దయ తలిస్తేనే, అప్పిచ్చాడు. అంతే, రోజూ తీర్చేయమని, వేర్రోడికి పిచ్చెక్కి నట్టు, వూరికే నస పెడుతుంటాడు. నేనెంత చీదరిమ్చుకున్నా… ఒదలడు. ఏమిటి, వాడి మీద జాలి పడుతున్నావు? నా అప్పు నువ్వు తీరుస్తావా?!…”.

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s