.tel.story.”reservation”by bhat sadhana

stories by rasp sadhana

వి:విప్లవం, విజ్ఞ్యానం; వే:వేదాంతం, క:కళాత్మకం; వెరశి:వివేకం.(RASP) కదల వెనుక ఇవన్నీ ఉండాలని అనుకునే వారికోసం ఈ రకం కధలు. హాస్య రహాస్య కధనాలను “ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో “…అనే ధోరణిలో ప్రయత్నిస్తాయి.మీ కోసం.. .Revolutionary,Artistic,Scientific,Philosophic(RASP) blended stories are here.to collect and to correct our lives they will try their better.OK!..for you..

.tel.story.”reservation”-read, understand and entertain the soul “రిజర్వేషన్”-కధానిక-భట్ సాధన

 
.tel.story.”reservation”-read, understand and entertain the soul   “రిజర్వేషన్కధానిక- భట్ సాధన
          

బస్ వచ్చేసింది.అంతవరకు ఎవరి గొడవలో వాళ్ళువున్న ప్రయాణీకులు ,వాళ్ళని సాగనంపటానికి వచ్చిన వాళ్ళు తమనీతీ,నియమం వెరసి డిసిప్లైన్ అన్నీ దేవుడికి,ప్రభుత్వానికివదిలేసి,హడావిడి పడిపోయారు. బస్ డోరు ఓపెన్చేయడం:దిగుతున్నవాళ్ళు,-
యెక్కేద్దాం,యెక్కేసి,సీట్లు ఆక్రమించుకుందాం“-అనుకుంటున్నవాళ్ళను చిరాకుగా చూస్తూ,-‘చేతుల్లోని బరువుకళ్ళుమోస్తున్నంత‘-బాధని వ్యక్తం చేస్తూ,కిందకు అడుగులువేస్తున్నారు.వాళ్ళు దిగటమే  :’తమ ఆటోలలో యెక్కి ఊరేగటానికి ‘-అన్నట్టు, వేరే వాళ్ల గొఢవ. చిట్టచివరిగా దిగుతున్న వాళ్ళురాజసంగా అతి లేటుగా దిగుతున్నారనిపిస్తుంది.యెక్కేవాళ్ళుఅందరూ కలిసి,వాళ్ళను దిగనివ్వకుండా
యెటేటైమ్‘-బాధపడి, బాధ పెట్టేస్తున్నారు.
కిటికీలదగ్గర వేళ్ళాడటం,టైర్లు యెక్కి,’లగేజీ సర్దుడు;లోపలకుబాగ్గులూ,కర్చీఫులూ ఇంకా యేవేవో అందిస్తూ,-ఓమూలదిగుతూవున్నవాళ్ళ చేత ప్రజాస్వామ్య రిజర్వేషన్స్‘-చేయించుకుంటున్నవాళ్ళు మరోవేపు.
పాప్కార్న్,బిస్కెట్ పాకెట్స్ అమ్ముకుంటున్నవాళ్ళు దర్జాగా అందర్నీబెదిరిస్తూ, వాళ్ళపని వాళ్ళు చేసుకుంటున్నారు.”ఆడమనిషికి దారివదలండయ్యా “-అంటూ;

కండక్టర్ తను టిక్కెట్లు ఇచ్చే డ్యూటీ చేసేసుకోక, యేమిటీ అలాఊరికే కూర్చుంటాడూ?డ్రైవర్ ఇంకా రాడేమిటీ?”-ఇలాంటి కామెంట్స్సీటు సపాదించుకు కూచున్న వాళ్ళ నోటివెంట.ఇక సీటుదొరకనినాలాంటి వాళ్ళ గొడవే వేరు.ము0దుసీట్లో యేదోగొడవ… 

ఒకడు వేసుకున్న కర్చీఫు రిజర్వేషన్ ని వేరే మనిషి రద్దు చేసేసి,-అంటే దాన్ని కిందపారేస్సి, తను అక్కడ కూర్చున్నాడట…”డామిట్కధ మొదలైంది“-అనుకున్నారు నాబోటి గురుజాడల్లో‘… నడుద్దాంఅనుకునే వాళ్ళు. పైగా తనే కర్చీఫ్ తీసియిచ్చి;                                     
నోర్మూసుకుని,వెనక యేదైనా సీట్లో సేఫుగా కూర్చోవైయ్యా! వెధవకర్చీఫ్ రిజర్వేషన్ నువ్వూనూ…”-అంటున్నాడు తాపీగాకూర్చున్నపెద్దమనిషి.
అనాధరైజుడు అండ్ అన్ గెజిటెడ్ రిజర్వేషన్ అకస్మాత్తుగా ఫెయిలైపోయిందని, మండిపోతున్న బాధితుడు
నువ్వే నోర్మూయి, బోడి ఉచిత సలహా నువ్వూనూ, గోటూహెల్;అంతలావుగా ఉన్నావ్,లారీ మీద స్పెషల్ గా పోరాదా,”-
అని యింకో సముచిత సలహా గిరాట్టేస్సి, నా వెనగ్గా దూరినుంచున్నాడు పాపం ఆయన ఏమీ చేత కాక.పుణ్య క్షేత్రాలకి వెళ్ళొచ్చిన కొన్ని తలలు తమ పాత నిండు క్రాఫులుగుర్తుకు తెచ్చుకున్నాయి.
చిల్లర లేకపోతే దిగిపోమ్మా. యివ్వాళ రేపు ప్రతివాడూ వంద నోట్లుప్రింటు చేసేయడమే, అవి కర్చు పెట్టడానికి బస్సులెక్కి మాప్రాణాలుతీసేయడమే.”-అని తన రియల్ డ్యూటీ మంత్రాలు మొదలు పెట్టాడుకండక్టరు.
నిల్చున్న వాళ్ళందరికీ రెండ్రెండు రూపాయలు రిబేటు యిస్తేబాగుండును“-అంటున్నాడు నాముందు అటుకులు నములుతున్నఆసామి.
డ్రయివరుకి యెడమ వైపుగా వున్న సీట్లో కూర్చోవడం ఒకరాజయోగం‘ :అని యెవరికి అనిపించదు చెప్పండీ.హాయిగా రోడ్డుచూస్తూ, ఊహల్లో తేలుతూ, డ్రయివర్ గొప్పతనం చూస్తూ బహుశావీలైతే పరిచయం పెంచుకుంటూ…’; చీటికీ మాటికీ దిగుతూ అదంతాగ్రేట్ స్పెషాలిటీ!
నాకూ సీటంటే వల్లమాలిన 

       


అభిమానం.న్యూటన్,ఐనిస్టీన్ పిజిక్సు సూత్రాలని యమ రీసర్చ్చేయచ్చు. అక్కడ కూర్చుంటే చాలా పెట్టి పుట్టాలిఅక్కడికిచేరుకోవాలంటేఅసలు సగటు ప్రయాణీకుడికి సీటు యంపీ సేటుకన్నా చాలా విలువైనది.


               
బస్సు బయలుదేరి చాలాసేపైంది. సీట్లు దొరికిన వాళ్ళు వివిధవిన్యాసాలలో లెక్చర్లలో మునిగి తేలుతున్నారు.నాకు సీటు దొరికివుంటే, యీపాటికి సగమన్నా క్రాస్ వర్డ్ ఫజిలు పూర్తి చేసివుండేవాడిని కదూ.
యింత అడ్డంగా చిరిగిన నోటు , నా బావమరిది యిచ్చినాతీసుకోను.”-అంటున్నాడు బొత్తిగా కండలు లేని కండక్టరునాముందు,  ఏమీ చేత కాక కిందే కూలపడ్డ మూటల మహాలక్ష్మితో.
గుర్తు తెచ్చుకుని మరిట్టే నవ్వుముఖం పెట్టాను.ఊరుపేరు చెప్పి,టిక్కెట్టైతే తీసుకున్నాను. భయపడ్డంతా అయ్యింది. మొహమాటంలేకుండా, రూపాయ్ తక్కువగా చిల్లర యిచ్చేశాడు కండక్టరు.శ్రీమాన్ఆర్టీసీ వారు ఆశీర్వదించిన ఇన్విజిబుల్ టాక్స్ రూపాయ్.
అప్రయత్నంగా అనుకోకుండా నేను నుంచున్న పక్కన రెండు సీట్లుఖాళీ అయ్యాయి. నేనూ, కర్చీఫ్ పెద్ద మనిషీ యెల్లాగైతేకూలపడ్డాం. ఆయనకు కిటికీ పక్క సీటు మెర్సీ రిజర్వేషన్కిందవదిలేశా.   
ఆయన నేనూ యెంచక్కా కబుర్లలో పడిపోయాం. యిరుకు, మురికీ,బురద, చీకటి రాజకీయాల గురించి, కులాల రిజర్వేషన్స్, ముఠాలప్రిజర్వేషన్స్, మతాల కన్సర్వేషన్స్ గురించీ;
వెనుక కూర్చున్న వాళ్ళూ రికామీగా  గొణుగుక్కుంటున్నారు.ధరల మీదా, ‘స్కీముల చాపల కింద స్కాముల మీదా, స్వాములఆశ్రమాల అక్రమ ఆస్తుల మీదా, నడిచిపోతున్నాయి: సెటైర్లూరియాక్టివ్ సెటైర్లూ.
బస్సు స్పీడు పెరిగింది. ఇటునుంచీ, అటునుంచీ లారీలని, యెడ్లబళ్ళనీ దాటేస్తూ, దూసుకుపోతోంది. చాలా మంది 50% ‘నిద్ర లాంటిరెస్టు తీసుకుంటున్నారు ప్రయాణీకం. అల్లాంటి రెస్టే తీసుకుంటూబస్సు నడుపుతున్న డ్రైవరు అదెదో వంతెన దగ్గర, బ్రేకే అనుకుంటావేశాడు మొత్తానికి.ఇంతకీ యెదురుగా వస్తూన్న లారీ డ్రైవర్ కూడా అదే సమయంలోఅచ్చంగా బ్రేకు లాంటిదే వేశాడట. కానీ మంత్రం పారలేదు.
దెబ్బకు అందరూ ఇహలోకంలోకి వచ్చేశారు. బాగా శబ్దంఅయ్యింది. అదేమంటే తప్పనిసరి పరీస్థితిలో ఇచ్చి పుచ్చుకున్నడాషింగన్నమాట. ఓకే!అదృశ్య లెక్కల మాస్టరు బస్సు లోకిదూసుకొచ్చినట్లుగా: అందరికీ బాగా దెబ్బలైతే తగిలాయి. బుడ్డిపిల్లలవాంఙ్మయాన్ని అనుసరించి, బాగా తలిగాయి మరి. అరుపులూ,హాహాకారాలూ; యేడుపులూ, గాజుపెంకులూ, రక్తం; స్పృహ లోకివస్తేగానీ నాకర్ధం కాలేదు;ఓహో ఐతే ఒకానొక యాక్సిడెంటుఅయ్యిందన్న మాట.  

        
     
ఐతే డ్రైవర్ కి మట్టుకూ డాష్ ఇచ్చే ముందే చాలా సార్లలాగేగుర్తుకొచ్చారు తన  భార్యా, తల్లీ, చెల్లీ, పిల్లా. అందుకే డాష్ యిచ్చేముందు చాలా మటుకు రైట్ టర్న్ యిచ్చేశాడు.దానివల్ల బస్సు లెఫ్ట్పార్ట్ సర్వతుక్కుఅయిపోయింది. నా పక్కన కూర్చున్న కర్చీఫ్పెద్ద మనిషి స్పృహలోలేడు. ఆయన కర్చీఫ్ ని తొలగించి,తగవులాడి,తొందరపడి రిజర్వేషన్ చెసుకున్న వాడికి  మటుకూ బతుకు అంతం అయిపోయింది.పచ్చడై, లయం అయిపోయాడు.మిగతా అందరూ కొద్దిపాటి గాయాలతో, గుండెల నిండా భయాలతోప్రయాణం లోంచి వచ్చిన ప్రమాదం నుంచి గట్టెక్కాం. శవం దానిపార్టులు శ్రధ్ధగా అంబులెన్సు దొరక్క లారీ లోకి యెక్కించారు.
బహూశా లేక సుమారు రెండు గంటల తరువాత, అస్సలు పరిచయంలేని: హాస్పిటల్ లో,నేను కళ్ళు తెరిచిన కాస్సేపటికి; కొన్ని బెడ్స్దగ్గర యేడుపులు అంటే: వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. నేనుకర్చీఫు పెద్ద మనిషిని గుర్తించగలిగాను.

        

చుశరా! ఆయనది సహజమైన రిజర్వేషన్; మీది ఒట్టి కర్చీఫ్రిజర్వేషన్‘; ఆయన చేసుకున్న  దానిలో…’  మీరు కూర్చుంటానంటేఆయన ఊరుకుంటాడా చెప్పండీ.ఆయన అన్న మాటలుగుర్తున్నయా…?!”
ఆయన చటుక్కున లేచి   కూర్చుని, కన్నీళ్ళతో:
గుర్తున్నాయి; నోరు మూసుకోని,-‘ వెనక ఏదైన చోటు చూసుకొనిసేఫుగా కూర్చోవోయ్; వెధవ కర్చీఫ్ రెజర్వేషన్ నువ్వూనూ…’ అనిఆశీర్వదించాడు మహనుభావుడు;”తరువాత ఆయన అంత్యక్రియలకి కూడా హాజర్అయ్యాము.అప్పుడుఅదే కర్చీఫుతో నుదురు, ముఖం, మెడఅద్దుకుంటూకన్నీళ్ళు తుడుచుకుంటూలేచి నుంచుని, దణ్ణంపెట్టుకుంటూ ఆవేశంగా ఇలా అన్నాడు.
ప్రతిరోజూ నిద్ర లేస్తునే, బ్రతికున్నన్నాళ్ళు దణ్ణం పెట్టుకుంటాను మహాత్ముడికి…”-
@@@
ప్రకటనలు

.tel.story.”reservation”by bhat sadhana”పై 2 స్పందనలు

  1. పింగ్‌బ్యాక్: .tel.story.”reservation”by bhat sadhana | raspsadhana

  2. పింగ్‌బ్యాక్: .tel.story.”reservation”by bhat sadhana | Sadhanaa Raspediaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s