tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana

“కాలం దూరాల మధ్య పోటీ” -భట్ సాధన

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0

“టైం ఎంత అయ్యిందిరా?”-విఘ్నేశ్వరున్ని అడిగాడు.-అమర్ మామయ్య  చుట్టూ చూశాడు.

టేబిలు పైన గ్లోబు తిరుగుతోంది.పైన లైటు వెలుగుతోంది.అశ్విక,అర్చన ఆడుకుంటున్నారు

పిల్లలకి ఈసారి అతను మరొక గమ్మత్తైన విషయం చెప్పబోతున్నాడు.చేతి కున్న వాచ్ ని చూస్తూ,

“సాయంత్రం ఐదున్నర…”-అన్నారంతా.

“ఎక్కడ?!”-అన్నాడు కళ్లెగరేస్తూ…

“నీ చేతి వాచీ లోనే…”అన్నారు పిల్లలు.యశ్వంత్,అభినవ్ సాగతీస్తూ.  

“మరి ఇంట్లో గోడమీది గడియారం లోనూ…?!”-

“అక్కడా అంతేగా…ఇంచుమించు”.

   Image result for space time black hole    Image result for space time black hole

“మరి పక్కింట్లో…?”

“అక్కడా అంతేగా…”

“మరి అవతలి వీధి బజారులోనూ…?”

“బజారులో ఎంటీ…బెజవాదలోనూ అంతే,బొంబాయ్ లోనూ అంతే “-ఆమాత్రం కూడా మామయ్యకి తెలీదా…అన్నట్లు.

“మంచిది,మరి పొరుగు దేశం పాకీస్తాన్ లో…?”

“అంతేనేమో!!…”-అన్నరంతానూ..

“ఏమీ కాదు,సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు…”-అన్నాడు అమరు.

“పాకీస్తాన్ లో వాచీలన్నీ అర గంట లేటేమో.పాపం.?!”-అంది ఉల్లాసంగా ఉమా.

“కారణం అది కాదు గానీ,ఇంకో తమాషా…ఇటు బంగ్లాదేశ్ ఎంతయ్యిందో తెలుసా…?”

“ఏమో…”-అనుమానంగానే అన్నారంతా..

“అక్కడేమో సాయంత్రం ఆరు ,మరి…”

“ఆరా…అక్కడివన్నీ..ఫాస్టేమో…”అనేసింది-లక్ష్మీ.కళ్ళు తిప్పుతూ..

       Image result for space time black hole

“ఇల్లా దేశదేశానికి టైము మారిపోతూ ఉంటే ,మరి కచ్చితంగా ఇప్పుడెంత అయినట్టూ…?”-కిరణ్ సూటిగా చూస్తూ….

“ఒక్క రేఖాంశానికి నాలుగు నిమిషాలు చొప్పున పడమటి నించి తూర్పు కి పెరుగుతూ/ ఐ మీన్ పెంచుతూ లెక్కిస్తారు….”-మామయ్య

“అయితే పది డిగ్రీ లకి నలభై నిమిషాలు తేడా నన్నమాట…”హవిష్ తేల్చేశాడు.

“అది అల్లాగుంచండీ,మనం మధ్యాహ్న్నం లంచ్ లాగించేస్తుంటే,ఆస్ట్రేలియా,న్యూజిలాండు వాళ్ళు హాయిగా ఆడేసుకుంటూ ఉంటారు.తెలిసిందా?!”-మామయ్య.

“అయితే,అదే టైముకి ఇంగ్లాడు వాళ్ళు మార్నింగు  బ్రషింగు  లో ఉమ్తారేమో..?!”-అంది భరణి వేళాకోళం గా..

“తమాషాకైనా నువ్వు చెప్పింది నిజమేనే భరణీ ,జీ.యం.టీ మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ,కరక్ట్ …”-భరణి సంతోషానికి హద్దులు లేవు.

“అయితే అదే టైముకి అమెరికా వాళ్ళంతా గుర్రు పెట్టి ,ముసుగు తన్నుతూ ఉంటారు.కదూ.”-సుదర్శనీ యాక్షన్ చేస్తూ అన్నది.

“అవునవును,వరల్డ్ కప్ రాత్రంతా మనం టీవీ లలో  చూస్తూంటే,ఆ దేశాల్లో పట్ట పగలు ,భలే..ఉందీ ఇదంతా.”-అమూల్య సంతోషంగా అంది.

“మన భూమి గుండ్రంగా ఉందీ,పైగా గిర్రున తిరుగుతోంది గాబట్టీ…”అమృత కోవిద కనిపెట్టేసింది.

“అది కూడా పడమటి నించి తూర్పుకి …అంతేకదా మామా …?!”-సుమస్వర ముక్తాయింపు యిచ్చింది.

Image result for times at poles          

“ద్రువాలదగ్గర యింకో తమాషా జరుగుతూ ఉంటుంది తెలుసా!?…”-అమరు మామయ్య …అందరూ నిశ్సబ్దంగా ఆశ్చర్య పోయారు.

“ఉత్తర ధృవం లో ఆరు నెల్ల రాత్రి,-అదే సమయంలో -“

“దక్షణ ధృవం లో ఆరు నెల్ల పగలు -అవునా మామా…?!”-సునేరీ కరక్ట్ గా గెస్ చేసింది.

“ఇకపోతే,ఆ రెండు ధ్రువాల్లో సూర్యుడి ప్రయాణం మన దగ్గరలాగా ఉండదు.తెలుసునా?!”

“తూర్పున బయలుదేరీ,పడమటికి చేరుతాడు.”-అమరు మామ సస్పెన్సు మొహం పెట్టాడు.

“ఇక్కడకూడా అంతేగా,దీనిలో తమాషా ఏముందీ?!-కొంపదీసి,మధ్యలో మూడు నెలలకి దక్షిణానికిగానీ చేరతాడా ఏమిటి?!”

-సాధన మొత్తానికి సందేహం లోంచి కూడా విజ్ఞ్యానం సాధించింది.మామయ్య –

“అందుకే కాలం అంటే ఒక ….”అని ఏదో చెప్పబోయేంతలో-

“అన్నాలకి టైము అయ్యింది లోపలికి రండర్రా…”అంటూ అమ్మమ్మ చూడామణి పిలిచేసింది.

Image result for midnight sun norway  Image result for midnight sun norway  Image result for northern lights  Image result for northern lights
ప్రకటనలు

tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana”పై 2 స్పందనలు

  1. పింగ్‌బ్యాక్: tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana | raspsadhana

  2. పింగ్‌బ్యాక్: tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana | Sadhanaa Raspediaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s