” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.’సొంత డూపు’ -కధానిక-సాధనభట్

stories by rasp sadhana

వి:విప్లవం, విజ్ఞ్యానం; వే:వేదాంతం, క:కళాత్మకం; వెరశి:వివేకం.(RASP) కదల వెనుక ఇవన్నీ ఉండాలని అనుకునే వారికోసం ఈ రకం కధలు. హాస్య రహాస్య కధనాలను “ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో “…అనే ధోరణిలో ప్రయత్నిస్తాయి.మీ కోసం.. .Revolutionary,Artistic,Scientific,Philosophic(RASP) blended stories are here.to collect and to correct our lives they will try their better.OK!..for you..

” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.’సొంత డూపు’ -కధానిక-సాధనభట్

Image result for buildings imagesImage result for buildings images

” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy

24.’సొంత డూపు‘ కధానికసాధనభట్
ఇందు గల డందు లేడని
సందేహము వలదు….”
మావాడికేసి నిటారుగాచూసి,
ఓయ్! ఇది పోతన గారి పద్యం రా!”-అన్నాను.
ఆవ్,నేనే పేరుతో రాసా“-
వదిలేస్తాననుకున్నాడు;
అబ్బే,ఆయన చాలాకాలం క్రితం వాడురా!”
ఐతేనేం నేను ఆయన అంశతోటి పుట్టినవాడినినాకు పూర్వజన్మసువాసనలున్నాయి, నీకు లేవు.”
 
సరే! కంపుల సంగతి వదిలేయ్,ఇప్పుడు ఎక్కడికివెళుతున్నామో తెలుసా నీకు?”
లేదు, ఎక్కడికి? సినిమాకా!?”-ఉత్సహంగా అన్నాడు.
కాదు, సినిమా యక్టరు ఇంటికి.”-
తూలి పడబోయాడు,అడ్డుకున్నాను.
!నిజమా,యెందుకు  యెలా వచ్చింది ఛాన్సు?”
అది అంతే,ఇంటర్వ్యూ అప్పాయింట్మెంట్ బుక్ చేశానుయేడాదికిందటే.”
నీ ఋణం జన్మలొ తీర్చుకోలేను.”
ఫర్వాలేదు, బైకు ఆపు.నెస్ట్ హౌసే…”హీరోగారి ఇల్లు చేరాము.
బోయ్ ఉన్నడుగేటు దగ్గర. లోపలికి విజిటింగ్ కార్డ్పంపాను.పిలుపు వచ్చింది.వెళ్ళాం.
మంచి సౌకర్యలతొ,విలాసవంతంగా ఉంది ఇల్లు,రూము.మిగితా ఇల్లు చూసినా, అస్సలు ఇళ్ళే చూడనివాళ్ళల్లా,వర్ణించడం యేమీ బాగోదు,అదోటీఅల్లా వర్ణించడం సభ్యతగాదని మన సొంత ఇది.యేమంటారు!?
ఆయన హీరోగారు వచ్చేశారు.లేచి నుంచుని, నమస్తే పెట్టాం.సెల్తో కాకుండా,టేప్ రెకార్డరు ఆన్ చేశాను.


నమస్తే,నమస్తేకూర్చోండీ.మీరూ…!?”-మర్యాదగా నసిగారు.
మా సిన మా పత్రికవిలేఖరిని నేను,వీడు మా…”
అనుకోకుండా మావాడి పరిచయానికి ఆయన అడ్డు పడ్డారు.
అభిమానులు దేవుళ్ళైతేమీరు దేవదూతలు.కానీయండి మీఇంటర్వ్యూ.”
ఇక లలిత కళల గురించి, ఆయన అభిరుచుల గురించీ,సినీరాజకీయాల గురించీ ఏవేవో
చొప్ప దంటు ప్రశ్నలు‘-నేను వేస్తేవాటికి తగ్గ ఊక దంపుడుసమాధానాలు‘-ఆయన ఇస్తున్నారు.
మాటల సందర్భంలో: మన హీరో గారు:
నాటకానుభవమేకాదు,జీవితానుభవం కూడా ఆట్టే లేదు;చదువూఅంతంత మాత్రం.అంతా, అన్నీ కలిసి నన్ను సూపరు హీరొగాచేశేశారు.అంతే!”
మధ్యన మీ చిత్రాలు ఒకటి,రెండేళ్ళు బాగా తగ్గిపోయాయి.రకరకాలుగా వార్తలు వచ్చాయి. మీదృష్టిలో అసలుకారణం యేమిటంటారు?-“ఆసక్తిగా అడిగాను.
అబ్బే యేంలేదు,మొదటి బెస్టుయాక్టరు అవార్డు వచ్చినపుడునటుడిగా నా భాధ్యతలు పెరిగాయనిపించింది. మూడులోనేనుండగా: ఒక నిర్మాత,వారి దర్శకుడు నా దగ్గరికి వచ్చారు.నన్నువాళ్ళ చిత్రంలో బుక్ చేస్తామన్నారు.”
“…”
నేను కర్మకాలిపోయి,-యీ చిత్ర కధ యేమిటి?,నా పాత్ర స్వభావంయేమిటి?-అని అడిగాను.”
“…”
అంతే,నన్ను వెర్రి వాణ్ణి చూసినట్లు చూసి,వెళ్ళి పోయారు.ఇండస్ట్రీలో నాకు పిచ్చివాడిననీ…,తెలివి తక్కూ వెధవననీపేరువచ్చేసింది.దాంతో నా రెండేళ్ల కెరీర్ దెబ్బ తింది.”- మోస్తరుఆవేశంతో అన్నాడు.

ఇంతలో ఒక అరడజను మంది వచ్చి, అదే గదిలోకూర్చున్నారు.హీరోగారిని సైలెంట్ గా విష్ చేసి,  కొందరైతే యేవోకాగితాలలో తలదూర్చుకోని ఉన్నారు.కొందరు రికామీగా మాసంభాషణ ప్రతి స్పందన బయటపెట్టుకోకుండావింటున్నారు.టిఫిన్లూ,టీలూ వచ్చాయి.ఇంకో ముగ్గురు వొచ్చారుఅదే గదిలోకి.
నేనింక ధన్యవాదాలు చెప్పుకొని,లేచి బయటపడదాంఅనుకున్నాను.మావాడు బద్దకంగా ఆవలించబోయి,దానిని చిన్నదగ్గుగా మార్చి, మర్యాద ప్రకటించాడు.లేవబోతూ నేనన్నాను.
ఈక్కడ ఆశీనులైన వారెవరండీ?మాకు పరిచయం చేస్తేబాగుంటుంది;అదీ మీకభ్యంతరం లేకపోతే…”
అబ్బే! విత్ ప్లెజర్…”
 ఆయన ఒక్కొక్కరినీ చూపుతూ వివరించారు.
వీరు గతంలో మాంచి నాటక రచయిత:ఇప్పుడు నా పి.యే గాఉంటున్నారు.”
అందరికీ కలిపి ఒక్కేసారి పెడదామనుకొని, నా వందనాలుప్రొక్రాస్టునేటుఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టాను.

ఆయన కొనసాగించారు.
వీరు మా దూరపుబంధువు:నా పర్సనల్ మేకప్ మాన్ వీరే;వీరునా ప్లేబాక్ సింగరు;వీరేమో నాకు డబ్బింగ్ వాయిస్ యిచ్చే శాస్త్రిగారు,గొప్ప యాక్టరు కూడా;…”
నేను అడ్డు తగులుతూ,ఉండబట్టలేక అడిగేశాను మరి:
చిన్న డౌటుమీ వాయిస్ కుడా బానే ఉంది కదండీ,మీకుడబ్బింగ్ యెందుకంటారూ?!”

                   


అబ్బే యేంలేదు,-నేను నటిస్తున్న చిత్రాల సంఖ్యపెరిగేటప్పటికి,రీరికార్డింగ్స్ కి నాకు డేట్స్ సరిపోక శాస్త్రి గారినియెంగేజ్ చేశారు దర్శకుడు. తర్వాత నా సొంత గొంతుతో రిలీజ్ఐన రెండు చిత్రాలు ఫ్లాప్కావడంతో ,తక్కిన దర్శకులందరూ : శాస్త్రి గారినే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వాడుతూవస్తున్నారు.”  

పాపం హీరో గారు తీరిగ్గా అల్లా వివరిస్తూంటే
నేను పోతా,నన్ను దయచేయనీ…”-అని యెల్లా అడగటంఅనితటపటాయిస్తున్నాను.
హీరోగారు కొనసాగించటం మానలేదు పాపం.
అది సరే,వీరిని కలవండీ,నా సినిమాలల్లో డాన్సులలో నాకుబదులుగా డూపుగా నటిస్తారుమిస్టర్ నటరాజ్పదేళ్ల క్రితం గొప్ప డాన్సు డైరెక్టర్; ఈమధ్యనే కరాటేనేర్చుకొని,’కొరియోగ్రాఫరుగా డాన్సులలో వైవిధ్యంసృష్టిస్తూన్నారు;”
ఇంకొకరిని చూపిస్తూ
వీరు నా సినిమాలలో శృంగార దృశ్యాలలో నా బదులుగానటిస్తారు“.
నాకు ఒక్కేసారి ఆశ్చర్యానందాలు 99.9% యెందుకో కలిగినమాటనిజం మరి.
ఆయన ఇంకా చెబుతూనె ఉన్నారు.
వీరేమొ కరుణ,శాంతి రసాత్మక దృశ్యాల్లో నాకు డూప్అన్నమాట;వీరేమో వీర,భయానక,భీభత్స,రౌద్ర రసాత్మక దృశ్యాల్లోనాకు బదులుగా నటిస్తూ ఒక్కక్కసారి ప్రాణాలనుకూడా లెక్కచేయకుండా నటిస్తారు.అప్పుడప్పుడూ పెద్ద పెద్దప్రమాదాలనుకూడా యెదుర్కుంటారు“.
 
 
 


 
Image result for drugs and alcohol pictures        Image result for drugs and alcohol pictures
 
వాళ్ళంతా నాకు డ్రగ్స్ యెడిక్ట్స్ లాగా కనిపించారు.అన్నట్లు వారియెదురుగా ఉన్న బల్లలపై రకరకాల మందులు,ఇంజెక్షన్ సిరంజీలుఉన్నాయి మరి.
          


ఇకపోతే వీరు మంచి హాస్యప్రియులు:నా చిత్రాల్లో హాస్య,అద్భుతరస దృశ్యాలలో నాకు డూప్ గా సహకరిస్తూంటారు.”

నేను సీరియస్ గా నవ్వేసుకున్నాను.పక్కనే మావాడునిద్రనాపుకోలేక తూలుతున్నాడు.నేను లేచాను. నవరసాలడూపులందరికీ నమస్కరించాను.

            


నవరస డూపుభ్యోంనమః
చాలా సంతోషం సార్, మీనించి ఇంకా మంచి చిత్రాలురావాలనీ,మీరు కేంద్ర,రాష్ట్ర అవార్డులు అనేకం పొందాలనీ ఆశిస్తూసెలవు తీసుకుంటున్నాను.ఇంకవెళ్ళివస్తాము సార్.”-

అంటూనే మావాడిని తట్టి లేపాను.బయలుదేరాము.హీరోగారు గేటుదాకా సాగనంపుతూ:
         

వెళ్ళిరండి,మంచిదిమరలా యెప్పుడైనా కలుద్దాం. అన్నట్లు ఇలామీతో ఇంత దూరం శ్రమ తీసుకొచ్చిన వీరిని (అంటే మావాడిని)పరిచయం చేయలేదు. మొదట్లో మీరు పరిచయం చేయబొతుంటేనేనే పొరపాటున అడ్డం వచ్చినట్టున్నాను.క్షమించండీ…”
ఇంకా యేదో అనబోయేంతలో నేను వారిస్తూ:
వీడా, యేం ఫర్వాలేదు, అంతగా చెప్పుకోతగ్గ వాడు యేమీకాదు లేండీ…”
అన్నాను.మావాడు కూడా యేమీ చిన్నబుచ్చుకొనే పరిస్థితిలోలేడు.వాడికి బయటికి యెప్పుడు వెళ్ళిపోదామా; బయటికెళ్ళియెప్పుడు పళ్ళు తోముకుందామా, నాలిక గీసుకుని,గెడ్డం గీసుకునిసబ్బుతో స్నానం చేశేద్దామా అన్నట్లుంది
మీ బ్రదరా!?”
కాదు
మీ ఫ్రెండా?!”
కాదు, వీడు నా డూపు, నా సొంత డూపు‘-అన్నమాట:
అదేమిటీ?!?!…”
ఆశ్చర్య పోయారు హీరో గారు;నేను తేల్చక తప్పలేదు:
నేను మీలాంటి మహానటులకు అభిమాన సగటు ప్రేక్షకుడిని కదా:నాకు బదులుగా నేను చూడాల్సిన మీ చిత్రాలన్నీ వీడే ఓపిగ్గాచూశేస్తూ ఉంటాడు: అదీ సంగతీ: దట్సాల్“.
          

  @@@.
ప్రకటనలు

” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.’సొంత డూపు’ -కధానిక-సాధనభట్”పై 2 స్పందనలు

  1. పింగ్‌బ్యాక్: ” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.’సొంత డూపు’ -కధానిక-సాధనభట్ | raspsadhana

  2. పింగ్‌బ్యాక్: ” somtha duupu” a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.’సొంత డూపు’ -కధానిక-సాధనభట్ | Sadhanaa Raspediaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s